మంగళ తోరణాలతో ప్రారంభమైన అంకమ్మ జాతర

* కార్యక్రమంలోపాల్గొన్న మాజీ ఎంపీపీ,సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, * మాజీ సర్పంచ్ దొడ్డ నిర్మల,మరియు జాతర కమిటీ సభ్యులు .

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 2 ,తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెంలో ఐదు రోజులు అంకమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో మొదటి రోజు బుధవారం ఉదయం మంగళ తోరణాలతో,విగ్నేశ్వర పూజతో ఎంతో వైభవంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ లు పాల్గొని తోరణపాకు కట్టి దేవాలయానికి అలంకరించారు. అనంతరం వారు జాతర కమిటీ సభ్యులతో మాట్లాడి జాతర సజావుగా జరిగేలా చూడాలని కమిటీని వారు కోరారు.అంతేకాకుండా రాత్రి జరగబోయే అమ్మవార్ల ఊరేగింపు ఘనంగా జరగాలని ఎక్కడ అవాంతరానీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అంకమ్మ జాతర కమిటీ వారియర్స్ పర్యవేక్షణ ఉండాలని ఈ ఐదు రోజులు జరిగే జాతర జిల్లాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేలా ఉండాలని కమిటీకి వారు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్,మరియు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, అన్నారుగూడెం గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఆ గ్రామ మాజీ సర్పంచ్ దొడ్డ నిర్మల, జాతర కమిటీ సభ్యులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మారెళ్ళ దేవేందర్, తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, దొబ్బల శ్రీనివాసరావు, పేరసాని నరసింహారావు, దుగ్గినేని సత్యనారాయణ, దొబ్బల శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు,రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *