మహిళా సమాఖ్య బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీఓ యాదగిరి.

*గ్రామాల్లోని సంఘాల సభ్యులు ఒక వేదికపైకి *200 గజాల్లో రూ.10లక్షలతో భవనాల నిర్మాణం *మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. *మహిళా సంఘాల ను బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది

పయనించే సూర్యుడి న్యూస్ ఏప్రిల్ 02. నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని కస్తాల గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులతో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులను చండూరు మండల ఎంపీడీఓ బి.యాదగిరి బుధవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా సమాఖ్య సంఘ సభ్యులకు సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి కార్యకలాపాల కోసం ఈ భవనం ఉపయోగపడుతుంది. మహిళా సంఘాల సభ్యులు ఒకే వేదికపైకి వచ్చి, స్వయం ఉపాధి, రుణాలపై చర్చించుకునేందుకు శాశ్వత భవనాలు వేదికలుగా ఉపయోగ పడతాయి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సమావేశాలు, శిక్షణకు ఈ భవనాలు కీలకం అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా సంఘాల ను బలోపేతం చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తోంది అని అన్నారు.  గ్రామాల్లోని సం ఘాల సభ్యులు ఒక వేదికపైకి వచ్చి…, వారి అనుభవాలు, రుణాలు మంజూరు, తదితర అంశాలను చర్చించుకునేందుకు సరైన వేదిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గ్రామాలు, మండలాల్లో వారికోసం ప్రత్యేకంగా శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించిం ది. ఇది మహిళా సాధికారతకు ఉపయోగపడుతుంది. వారి కార్యకలాపాలు నిర్వహించేందుకు స్వయం ఉపాధి పెంచుకునేందుక పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. గ్రామ, మండలస్థాయిల్లో ఒక స్థిరమైన వేదికను ఏర్పాటు చేయడం ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్నిపెంచేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామపంచాయతీలస్థాయిలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనానికి రూ.10లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈమేరకు భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాలను కూడా సంబంధిత శాఖలు సిద్ధంచేశాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్ గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలిమికొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ , ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నర్సింహా , దోనాల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు అంజయ్య, అమాలూరి అశోక్,గురజాల స్వామి , ధోనాల వెంకట్ రెడ్డి ,సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ ,సిపిఐ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు ,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *