మాదాపూర్ లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు న్యూస్: ఏప్రిల్ /02:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో రైతులు పండించిన మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సత్యనారాయణ అన్నారు. బుధవారం గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మధ్యవర్తుల సమస్య లేకుండా రైతులు నేరుగా కేంద్రాలకు పంటను తీసుకువచ్చి అమ్ముకోవాలని ఆయన సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి రైతుకు అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ పులి కృష్ణ,పార్టీ నాయకులు చింతల శ్రీధర్ రెడ్డి, మాతంగి అనిల్, బుర్ర మల్లేష్ గౌడ్, మల్లికార్జున్, వేణు, వెంకట్ రెడ్డి, తిరుపతి, అంజిరెడ్డి, కటకం తిరుపతి, జిల్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *