మాధవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 02 రిపోర్టర్ అభి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్లు ప్రతి నెలా సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.