యువజన సంఘం బలోపేతమే లక్ష్యం: అఖిలభారత యువజన సమాఖ్య

పయనించే సూర్యుడు ఏప్రిల్ 02,(చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలోని రాఘవపురం గ్రామంలో అఖిలభారత యువజన సమాఖ్య గ్రామ శాఖ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువజన సంఘం జిల్లా కోశాధికారి కొల్లి రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి మహేష్ మాట్లాడుతూ, మండలంలో యువజన సంఘాన్ని బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేపడతామని అన్నారు. విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యువజన పతాకాన్ని కొల్లి రవి ఆవిష్కరించారు.కార్యక్రమంలో యువజన సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్, జిల్లా సహాయ కార్యదర్శి చింతాల రమేష్, నాయకులు మామిళ్ళపల్లి రాజేష్, కనపర్తి సత్యనారాయణ, వడ్డే వీర కృష్ణ, చలమల అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్కే రహీం పాషా, కార్యదర్శిగా కొత్తకొండ మురళి ఎంపిక కాగా, 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *