పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 02 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ మండల కేంద్రమైన రంగంపేటలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. స్థానిక 1 మరియు 2 సచివాలయాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.వివరాల్లోకి వెళ్తే:మొత్తం రెండు సచివాలయాల పరిధిలో 970 మంది లబ్ధిదారులకు 42 లక్షల రూపాయల పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు. ఇందులో సచివాలయం-1 పరిధిలో 490 మందికి, సచివాలయం-2 పరిధిలో 480 మందికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని కొనియాడారు. అనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.పాల్గొన్న ప్రముఖులు:ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్ మాండవిల్లి గుప్తా, రాజమండ్రి జి.జి.హెచ్.టి.ఎస్ సభ్యులు యలమటి రాంబాబు, రంగంపేట పీఏసీఎస్ అధ్యక్షులు గారపాటి రాంబాబు, పీఏసీఎస్ సభ్యులు దుబాసి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వీరితో పాటు రంగంపేట గ్రామ ఉపసర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, పూర్వపు పీఏసీఎస్ అధ్యక్షులు వుండవిల్లి గంగాధరం, 129 బూత్ ఇంచార్జ్ ఉండవల్లి శివప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఒబిన్ని అనిల్ కుమార్, పార్టీ సీనియర్ కార్యకర్త మట్టపర్తి రామకృష్ణ, సేనగశెట్టి సత్తిబాబు, మత్స్యకార సొసైటీ అధ్యక్షులు సహదేవుడు, నీటి సంఘం చైర్మన్ గారపాటి శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.