
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి గ్రామంలో పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల కోసం ఉచిత గాలి కుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పోతరాజు ప్రకాష్ సమక్షంలో, డాక్టర్ పరశురాం పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెలు, మేకలు సహా అన్ని రకాల పశువులకు గాలి కుంట వ్యాధి నివారణకు టీకాలు, మందులు అందించారు. పశువుల ఆరోగ్య సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. అదే రోజు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లల తల్లులను పిలిపించి, గర్భిణీలు (ANC) మరియు బాలింతలు (PNC) ప్రతిరోజు అంగన్వాడి కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పిల్లల బరువు, ఎత్తు కొలతలు తీసి, పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లులకు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పిస్తూ, భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేముల శ్రీకాంత్, అంగన్వాడి టీచర్ యశోద, ఆశా వర్కర్ లావణ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.