వైభవంగా శ్రీశనేశ్వర స్వామికి శతకుంభ పూర్ణ తిల తైల అభిషేక పూజలు.

267 పూర్ణకుంభాలు,267 మంది దంపతులతో ప్రత్యేక అభిషేక పూజలు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో వెలిసిన శ్రీ జేష్ఠా మాత సమేత శనీశ్వర స్వామి దేవాలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు శ్రీ శనీశ్వర స్వామి వారికి శత కుంభ పూర్ణ తిలతైల అభిషేక పూజలు వైభవంగా జరిగాయి. శనేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మహాన్యాస పూర్వక అభిషేకాలు వేదమంత్రచరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరియు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి వచ్చిన 267 దంపతులతో,267 నువ్వుల నూనెతో కూడిన పూర్ణ కుంభాలతో స్వామివారికి ప్రత్యేకంగా తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు.శ్రీశనేశ్వర స్వామివారిని కొల్చిన భక్తులకు స్వామివారు అనుగ్రహించి ,అష్టమ, అర్ధాష్టమ,ఏలినాటి, జన్మరిత్యా,గోచార రీత్యా ఉన్న శనిగ్రహ దోష పరిహారం విశేషంగా కటాక్షిస్తారని ఆయన అన్నారు.అనంతరం ప్రదోషకాలంలో సమయంలో శ్రీ జేష్టా దేవి సమేత శనీశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని వేద అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజలలో పాల్గొన్న 1600 భక్తులకు ఆలయ ఆవరణలో అన్న ప్రసాద పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాలరావు,ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి,కమిటీ సభ్యులు, గ్రామస్తులు,భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *