పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: వేములవాడ పట్టణంలో శాతరాజుపల్లి బీరప్ప పట్నాలలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షులు గోపి పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ గొల్ల కురుమ కులస్తుల ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే బీరప్ప పట్నాలు అద్భుతంగా నిర్వహిస్తున్న కులస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుల దైవం ఆశీర్వాదంతో పాడిపంటలు వర్షాలు సకాలంలో కురిసేలా దీవించి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నామని అన్నారు వారి వెంట కురుమ సంఘం సబ్యులు మేకల చిన్నయ, శ్రీనివాస్ రఘుపతి, గుడిసె మనోజ్, వినోద్ మహేందర్, బిజెపి నాయకులు పిన్నింటి హనుమాన్లు మహంకాళి శ్రీను రేగుల రాజకుమార్ జవ్వాజి రాజశేఖర్ బిల్లా కృష్ణ యశ్వంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు