
పయనించే సూర్యుడు 2 ఏప్రిల్ 2026 చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా దగడపల్లి అమ్మాయి పల్లి గ్రామాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. దగడపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు వచ్చిన మంత్రి గ్రామ సర్పంచ్ మాట్లాడాలని కోరారు సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి కొమ్మ గంగాధర్ ఉపసర్పంచ్ పద్మ శంకర్ సమావేశాన్ని కొనసాగిస్తూ.గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియజేస్తూ గ్రామపంచాయతీ ఆఫీసును గత ప్రభుత్వ హాయంలో తొలగించడం జరిగిందని గ్రామపంచాయతీ రైతు వేదిక దగ్గర సమావేశాలు నిర్వహించుకుంటున్నామని అట్లాగే పెద్ద దగడ చిన్న దగడ గ్రామాలకు బీటి రోడ్డు వేయాలని తూముకుంట – దగడపల్లి గ్రామాలకు బీటీ రోడ్డు వేయాలని మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వీలైనంత త్వరగా నీటి సమస్య పరిష్కరించాలని కోరారు. జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సగం పూర్తి అయి ఉన్న గదలను త్వరగా పూర్తి చేయాలని అదనపు నిధులు కేటాయించాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మీ గ్రామంలోని సమస్యలను అన్ని విన్నానని కాసేపు వేరే విషయాలు మాట్లాడుకుందాం అంటూ మంత్రి గ్రామంలో చిన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలలను చదివించాలని కోరారు అవకాశం ఉంటే ట్యూషన్లకు పంపాలని పిల్లలు చదువుకుంటే ప్రయోజకులు అవుతారని ప్రయోజకులు అయితే మన ఊరు బాగుపడుతుందని అన్నారు దేవుడి గుడిలను కడితే మోక్షం వస్తుందని అంటున్నారు మోక్షం మాట తర్వాత విషయం విద్యాలయాలు కడితే పిల్లలు విద్యావంతులవుతారని అన్నారు. తన బాల్య స్మృతులను గుర్తుకు చేసుకుంటూ మరిచిపోయినారు అప్పటి చదువులకు ఇప్పటి చదువులకు చాలా తేడాలు ఉన్నాయని రామాయణం మహాభారతం లాంటి పురాణాలను విన్న రోజులను గుర్తుకు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ గ్రామ సమస్యలన్నీ విన్నానని పాఠశాలకు సంబంధించి రక్షణమే నిధులు వచ్చే విధంగా చూస్తానని అదనంగా 50 లక్షలు ఇస్తున్నానని హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీ ఆఫీస్ కి సంబంధించి లైబ్రరీ గ్రామపంచాయతీ ఆఫీస్ 50 లక్షలు ఇస్తున్నానని తక్షణమే పనులు ప్రారంభించే విధంగా చేయాలని అవినీతి లేకుండా పనులు పూర్తి చెయ్యాలని గ్రామ సర్పంచ్ కు ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు సంతోషంతో చప్పట్లు కొట్టారు. అలాగే రోడ్లకు సంబంధించి వీలైనంత త్వరగా సాంక్షన్ చేయించి వర్క్ ఆర్డర్ ఇస్తానని హామీ ఇచ్చారు.మంచినీటి సమస్యను అధికారులతో మాట్లాడి నీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు అలాగే మీ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నిటిని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము గంగాధర్ ఉపసర్పంచ్ పద్మ శంకర్. వార్డ్ నంబర్లు.అంగన్వాడీ టీచర్లు.ఎమ్మార్వో. ఎంపీడీవో. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.