పయనించే సూర్యడు ఏప్రిల్ 02 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడంలో సూర్యాపేట జిల్లా పోలీసులు మరోసారి విజయం సాధించారు. సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను బాధితుడికి అందజేశారు. వివరాల్లోకి వెళితే: నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన పోలంపల్లి సతీష్ కొన్ని నెలల క్రితం కోదాడ బస్టాండ్‌లో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. దీనిపై బాధితుడు కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి మొబైల్ ఐఎంఈఐ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోర్టల్‌లో నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన కోదాడ టౌన్ పోలీసులు, పోయిన ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో రికవరీ చేసిన ఫోన్‌ను బాధితుడు సతీష్ కుటుంబ సభ్యులకు పోలీసులు అందజేశారు. తన మొబైల్ ఫోన్‌ను తిరిగి అప్పగించినందుకు సూర్యాపేట ఎస్పీ కి, అదేవిధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కోదాడ టౌన్ పోలీసులకు సతీష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు విజ్ఞప్తి: మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైనా ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. లేదా స్వయంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ . సి ఈ ఐ ఆర్ . గౌట్ .ఇన్ పోర్టల్‌లో ఫోన్ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయవచ్చని, తద్వారా దానిని తిరిగి పొందే అవకాశం ఉంటుందని వారు తెలిపారు.