
పయనించే సూర్యుడు ,ఏప్రిల్ 02 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూర్గంపాడు మండలం, నాగినేని ప్రోలు రెడ్డి పాలెంలో గతంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టవద్దని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం విధితమే ఊరి లోని గ్రామస్తులకు, సెల్ టవర్ కి సంబంధించిన కాంట్రాక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. నిబంధనల ప్రకారం సెల్ టవర్ అనేది అంగన్‌వాడీ కేంద్రలకు, ఆసుపత్రులకు, పాఠశాలలకు, జనావాసాలకు 100 మీటర్ల దూరంలో ఉండాలి అనే నిభందనలు ఉన్నాయని కానీ గ్రామ సర్పంచ్, పాలక వర్గానికి, గ్రామస్థులకు కూడా తెలియకుండా ఈ సెల్ టవర్ నిర్మాణానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని, పక్కనే ఉన్న ఒక కుటుంబం ఇంటి ప్రహారీ గోడ దగ్గర గా దాదాపు 20 అడుగుల లోతులో గోయ్యి తీసిన సంగతి వివిధ పత్రికల రూపంలో సర్పంచ్ మరియు సిడిపిఓ కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగినది. అంగన్ వాడీ కేంద్రంకు 10 మీటర్ల దూరంలో నే సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది అని, ఈ కేంద్రం లో దాదాపు 15 మంది అభం, శుభం తెలియని చిన్న పిల్లలు, ఆరుగురు గర్భిణీలు ఉన్నారని, ఈ నిర్మాణం జరిగితే భవిష్యత్తు లో ఈ రేడియేషన్ కారణంగా వచ్చు వ్యాధులకు, జరుగు పరిణామాలకు భాద్యులు ఎవరని, సీడిపివో రేవతి ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామస్థులు నాకు రాతపూర్వకంగా సమాచారం ఇవ్వడం తో నేను ఇక్కడకు హుటాహుటిన వచ్చాను అని, నేను కూడ ఈ విషయమై కలెక్టర్ కు వినతిపత్రం ఇస్తానని తెలియజేశారు. నిర్మాణ పనులు జరుగుతుంటే గ్రామ సర్పంచ్ వారిని నిలదీయగా మీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు, పైనుండి మాకు అనుమతులు ఉన్నాయి అంటూ దురుసుగా మాట్లాడారని, గ్రామంలో జరిగే పనులకు సర్పంచ్ అనుమతి లేకుంటే, ఊరికి సర్పంచ్ ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇట్టి విషయమై ప్రజాదర్బార్లో ప్రజలు కలెక్టర్ కు సెల్ టవర్ నిర్మాణం ఆపాలని తెలియజేశారు. అయితే బుధవారం ఇదే విషయమై డిఆర్డిఓ కలెక్టర్ ఆదేశాల మేరకు రెడ్డిపాలెం సెల్ టవర్ నిర్మాణం విషయమై పరిశీలించడం జరిగినది.