స్టార్ హాస్పిటల్స్‌లో తిరునల్లార్ పూజారిని పరామర్శించిన ఎమ్మెల్యేలు

పయనించే సూర్యడు / ఏప్రిల్ 02/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు పాండిచేర్రీ రాష్ట్రంలోని తిరునల్లార్ శ్రీ దర్బారన్యేశ్వర స్వామి దేవస్థానం పూజారి మహాలింగ గురుక్కల్‌ను ఉప్పల్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, అరికపూడి గాంధీ బుధవారం పరామర్శించారు. బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న గురుక్కల్‌ను కలిసి వారు యోగక్షేమాలను విచారించారు. ఇటీవల గురుక్కల్‌కు హృదయ శస్త్రచికిత్స విజయవంతంగా జరగడం పట్ల ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, గురుక్కల్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం ఆయన కుమారుడు దిలీప్ స్వామిని కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తమకు మెరుగైన వైద్యం అందించిన స్టార్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గుడపాటి రమేష్‌ను మహాలింగ గురుక్కల్ సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ఉప్పలపాటి శ్రీకాంత్, నర్నె శ్రీనివాస్ రావు, సోలిస్ కంటి హాస్పిటల్ చైర్మన్ నందనంపాటి రాము, అరికపూడి ప్రసాద్, మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, శంకర్ బాబు, రామకృష్ణ, సుబ్బా రావు, లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.