అంబేద్కర్ విగ్రహం మార్పిడిపై రౌండ్ టేబుల్ సమావేశం

★ అంబేద్కర్ విగ్రహాన్ని అంగడి బజార్లోనే ఏర్పాటు చేయాలి ★ బాలనగర్ మండలం అంబేద్కర్ సంఘం పిలుపు

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 3 జడ్చర్ల తాలూకా బాలానగర్ మండల రిపోర్టర్ రేవల్లి కృష్ణ తేదీ 03-04-2026 శుక్రవారం నాడు బాలనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం నుంచి స్టేషన్ రోడ్డు (అంగడి బజార్లో) తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు బాలనగర్ మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మన మండలంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు బాలనగర్ మండల అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు అంబేద్కర్ అభిమానులు అందరూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మీ యొక్క సూచనలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ అంగడి బజార్ లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము.