అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

★ రంగంపేటలో మిన్నంటిన సంబరాలు- బాణసంచా కాల్చి, బైక్ ర్యాలీతో హోరెత్తించిన ఎన్డీయే శ్రేణులు ★ ప్రధాని మోడీ సీఎం చంద్రబాబులకు రైతుల కృతజ్ఞతలు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 03 అనపర్తి నియోజకవర్గం సురేష్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభలోనూ చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం లభించడం పట్ల రంగంపేట మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ మండల కేంద్రంలో ఎన్డీయే కూటమి నాయకులు, రైతులు మరియు స్థానిక ప్రజలు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.ఘనంగా బైక్ ర్యాలీ:ఈ సందర్భంగా మండల నాయకుల ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ నినాదాలతో రంగంపేట పురవీధులు మారుమోగాయి. అనంతరం ముఖ్య కూడలి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి దక్కిన ఈ గుర్తింపు ఆంధ్రుల విజయమని ప్రజలు కొనియాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు:అమరావతికి పూర్వవైభవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా రంగంపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతే దిక్సూచి అని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కూటమి నాయకులు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.