పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 03.04.2026 మదనపల్లి అన్నమయ్య నియోజక వర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గురువారం స్థానిక బస్టాండ్ లో టపాసుల మోతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాబిషేకం మండల ప్రధాన కార్యదర్శి బోయకొండ సుబ్రమణ్యం(సుబ్బు) ఆద్వర్యంలో విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ప్రయాణికులకు స్విట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు పొన్నా సోమశేఖర్, శ్రీధర్ రాజు(గిరి రాజు), పాళ్యం రెడ్డి,రాథాకృష్ణ, పరికిదొన చెంగల్రాయలు, విజయభాస్కర్ రెడ్డి,యనమసామన పల్లి నాగరాజ రెడ్డి,భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.