అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు

జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా మోటర్ బైక్ ర్యాలీ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 మార్చి 28న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకారంతో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగా, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, అలాగే కేంద్రంలోని మిత్రపక్షాల నాయకులకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు తెలుగు యువత అధ్యక్షుడు ఎస్. అబ్బాస్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నుంచి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *