అమ్దాపూర్ లో కుస్తీమే సవాల్.

★ మల్లయోధులకు నగదు బహుమతులు అందజేస్తున్న గ్రామ పెద్దలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 3 బోధన్ : హనుమాన్ జయంతి పురస్కరించుకొని బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గురువారం కుస్తీ పోటీలు హోరాహోరీగా జరిగాయి.హనుమాన్ మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పెద్దలు గ్రామంలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలను ప్రారంభించారు కుస్తీలు పట్టడానికి మల్లయోధులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు కుస్తీ పోటీలలో గెలుపొందిన మల్లయోధులకు నగదు పురస్కారాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరెడ్డి గంగాధర్ ఉప సర్పంచ్ రుమ్మాజి గ్రామ పెద్దలు జాతి నాగన్న నవత్ నాగేష్ పల్లెన్న బద్రప్ప రత్నాకర్ ఎన్ గంగాధర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.