పయనించే సూర్యుడు, కోరుట్ల ఏప్రిల్ 3 ( చింతోజీ రాధాకృష్ణ ) అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణ లోని 13వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. వార్డు ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గత 24 నెలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతుబంధు. రైతు బీమా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, గ్యాస్ సబ్సిడి, చేయూత పింఛన్లు. కళ్యాణ లక్ష్మి వంటి పథకాలతో పాటు ఇందిరా మహిళా శక్తి కింద వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. గత పది సంవత్సరాలుగా పేద, మధ్య తరగతి ప్రజలు ఎదురుచూసే రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులను గుర్తించి రేషన్ కార్డులు మంజూరు. రేషన్ దుకాణాల ద్వారా సన్నబియం పంపిణీ చేసిందని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కోరుట్ల మున్సిపల్ చైర్ సర్సన్ తిరుమల వసంత గంగాధర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.