అవయవధాన అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు 3.4.2026 చోడవరం అనకాపల్లి జిల్లా రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకము ఒకటి రెండు మూడు వారి ఆధ్వర్యంలో "అవయవ దాన అవగాహనా సదస్సు" 02.04.2026 రోజున కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సావిత్రిబాయి పూలే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ సీతామహాలక్ష్మి అన్నారు మాట్లాడుతూ ప్రపంచంలో అన్నదానం కన్నా నేత్రదానం, శరీర అవయవ దానం చేయడం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతారని యువత ఈ విషయంలో మంచి అవగాహన కలిగి ముందుండాలని ఉద్బోధించారు. ప్రతి విద్యార్థి జీవన ధాన్ వెబ్ పోర్టల్ లోకి వెళ్లి రిజిస్టర్ అయ్యి ప్రతిజ్ఞ తీసుకొని ఐడెంటి ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు. బ్రహ్మకుమారిస్ విశాఖపట్నం కుమారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు మోరల్ వాల్యూస్, సమాజానికి మనం చేసే మేలే గుర్తుండిపోతుందని తెలియజేశారు. జోషి మాట్లాడుతూ సమాజానికి విద్యార్థులుగా మీరు అవయవ దానం చేసి మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్ గా ఉపయోగపడాలని సూచించారు. కార్యక్రమ అనంతరం వెటర్నర్ అథ్లెట్ ముత్యం లక్ష్మీ నీ సన్మానించారు. విశ్వనాథ టైపింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శ్రీ బాబ్జి, ఆల్ముని అసోసియేషన్ కార్యదర్శి గుప్త మరియు పద్మిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంగ్ల అధ్యాపకులు హెచ్వో డి డాక్టర్ మల్లి బాబు అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. వైస్ ప్రిన్సిపాల్ ఐ వి వి సత్యవతి, ఐ క్యూ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రత్న భారతి, డి.మాల్యాద్రి, బి.పిచ్చమ్మ, సీనియర్ అధ్యాపకులు హెచ్ సుదీర్, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ జ్యోతి,