
పయ నించే సూర్యుడు ఏప్రిల్ మూడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్రభుత్వ విప్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గ ప్రధాన కేంద్రం ముమ్మిడివరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల లో కేక్ కట్ చేసి, ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి మరియు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని, మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన దీపాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుండి నగర పంచాయతీ ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి, గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ముమ్మిడివరం నగర పంచాయతీ అంతా విశేష జనవాహిని మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలనే సంకల్పానికి పార్లమెంటులో చట్టబద్ధత రావడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక ఘట్టమని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందడంలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేస్తున్న కృషికి ఈ నిర్ణయం మరింత బలాన్ని చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లు అశోకు, తాడి నరసింహారావు, కూటమి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు