ఆర్డీవో బి పావని అభినందించిన జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు ఆర్డీవో బి.పావని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల గురువారం ఘనంగా సత్కరించారు. వింజమూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆత్మకూరు ఆర్డీవో బి.పావని ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. వింజమూరు కార్యక్రమాన్ని పర్యవేక్షణ అధికారిగా 15 రోజులుగా వింజమూరులోనే ఉంటూ రాత్రి పగలు పూర్తి పర్యవేక్షణతో అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల గురువారం కార్యాలయంలో ఆర్డీవో బి పావని ని అభినందించి ఘనంగా సత్కరించారు. వీరితోపాటు పాల్గొన్న అన్ని శాఖల అధికారులను కూడా అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *