ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదం అమరావతి రాజధాని

విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చరిత్రత్మక నిర్ణయం.కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఐదు కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినింది ఏం చేయాలో తోచక మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015 ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభించినారు దానికి ఆంధ్రప్రదేశ్ రైతుల 29 గ్రామ ప్రజలు రాజధాని కోసం 33 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చినారు* రాజధానికి ఒక నగరం పేరు పెట్టాలని దూర దృష్టితో ఆలోచించి అమరావతి అని నామకరణ చేయడానికి ప్రధానమంత్రి వచ్చినారు* కానీ ఆంధ్రుల దురదృష్టకరం 2019లో ఒక్క ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన జగన్ మూడు రాజధానిలు అని మూడు ముక్కలాట ఆడినారు అమరావతి రైతులను కొట్టినారు కేసులు చేసినారు అంతేకాదు దాదాపు 1600 వందల రోజులు దీక్ష చేస్తే పట్టించుకోనే నాధుడే లేకుండా పోయినారు కానీ ప్రజలు అర్థం చేసుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికినారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత ఆంధ్ర ప్రజలకే తగ్గుతుంది అని కొనియాడారు అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని* అని అమరావతిని చట్టబద్ధమైన రాజధానిగా చేసుకోవాలని మంత్రివర్గం లో నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు లోక సభకు పంపించడం జరిగింది నిన్నటి రోజు లోకసభలో అమరావతి శాశ్వత రాజధాని* అని బిల్లు పాస్ అవడంతో చివరకు ఈరోజు రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పాస్* అవ్వడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పరంగాచైర్మన్ మాన్వి దేవేంద్రప్ప నరేంద్ర మోడీ కి అమీషా కి చంద్రబాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి సంతోషంగా కృతజ్ఞతలు తెలిపినారు ఇది కేవలం రాజధాని మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రైతుల రాజధాని మహిళల ఆత్మభిమానానికి నిదర్శనం ప్రజల రాజధాని ఇప్పుడు నుంచి ఒక్క అంగుళం కూడా రాజధానిని కదిలించే ప్రసక్తే లేదు అని హర్షం వ్యక్తం చేసినరు దీనికి నిదర్శనం *అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటి నుంచి నీళ్లు మట్టి తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్ లో దేవాతల సన్నిధిలో హోమం చేసి అమరావతి రాజధాని కి పునాది వేసినారు ఆ దైవమే ఈరోజు అమరావతిని కాపాడింది ఈ దేవ దేవతల రాజధాని అని సంతోషం ప్రజలతో పంచుకున్నారు.