ఒంటిమిట్ట అభివృద్ధికి వాస్తు మార్పులు అవసరం : బత్యాల

పయనించే సూర్యుడు-03-04-2026-రాజంపేట న్యూస్ : కోదండ రాముని కళ్యాణానికి విచ్చేసి ఒంటిమిట్ట దేవస్థానం అతిధి గృహం నందు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు కలిసి ఒంటిమిట్ట అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఒంటిమిట్ట దేవాలయానికి పడమర వీధి పోటు (కడప నుండి రాజంపేటకు వచ్చే రోడ్డు) ఉందని, గుడిపై ప్రభావం చూపుతోందని, మంచి వాస్తు నిపుణులచే వాస్తు రీత్యా 100 అడుగుల వెడల్పుతో మాడవీధులను తిరుమలలో చేసినట్లు చతుర ప్రకారాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు తెలియజేయగా వెంటనే ఆ విషయంపై స్పందించి సంబంధిత అధికారులను పిలిచి వారికి ఆదేశాలు జారీ చేసినట్లు బత్యాల తెలియజేశారు. అలాగే ఒంటిమిట్ట స్థల పురాణం గురించి కూడా చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చించి పలు విషయాలపై వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *