కనక దుర్గమ్మ ఆలయానికి దారి హద్దులు ఏర్పాటు చేసిన అధికారులు

ప్రజావాణిలో ఫిర్యాదు పై కదిలిన యంత్రాంగం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 03 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని మైతాఫూర్ గ్రామంలో ఉన్న గన్నే గుట్ట పైన ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం దారి కొరకు సోమవారం రోజున జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో దారి హద్దులు ఏర్పాటు చేసి హద్దులు ఏర్పాటు చేయాలని వార్డు సభ్యులు అనుమల్ల రమ,బూస గంగా మల్లయ్య, తొగిటి నవీన్,భూపెళ్ళి పరమేశ్వరు గ్రామ నాయకులు అనుమల్ల సత్యనారాయణ, మాదిరి మల్లయ్య ఇచ్చిన ఫీర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మండల అధికారులు మైతాఫూర్ గ్రామానికి వచ్చి గత రెండు రోజులుగా భూములు కొలిచే పరికరాలు, డిజిటల్ కెమెరాల ద్వారా ప్రభుత్వ నక్ష లో యున్నందున దాని ఆధారంగా ఆలయానికి దారి కొరకు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ భూమి కొలత ల శాఖ అధికారి కిషన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇట్టి భూమి సరిహద్దుల కొరకు ప్రజావాణి కార్యక్రమంలో గ్రామస్తులు దరఖాస్తు వచ్చినందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మే ము వచ్చి డిజిటల్ మెటీరియల్ తో మేజర్ మెంట్ ప్రకారం కొలతలు చేసి సక్రమంగా హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ తహసీల్దార్ నాగార్జున, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దేవదాసు,గ్రామ పరిపాలన అధికారి శ్రీనివాస్, అసిస్టెంట్ గ్రామ పరిపాలన అధికారి నిమ్మల తిరుపతి,వార్డు సభ్యులు అనుమల్ల రమ, బూస గంగా మల్లయ్య,తొగిటి నవీన్,భూపల్లి పరమేష్, ఆలయకమిటి ఛైర్మన్ రాజనాల మధు, మాజీ సర్పంచ్ గన్నే రాజారెడ్డి గ్రామస్తులు కొల్ల కృష్ణారెడ్డి, అనుమల్ల సత్యనారాయణ, పాలడుగు లింగారెడ్డి, శివనీతి కిష్టయ్య,అరవింద్, శ్రీనివాస్ భూమి పట్టా దారులు పాల్గొన్నారు.