
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 03. ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 02 గురువారం రోజున చండూరు మండలం కస్తాల గ్రామంలోని రైతు వేదికలో కస్తాల గ్రామ స్పెషల్ ఆఫీసర్ , ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెంట్ నర్సింహా గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభను గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం మరియు గ్రామ సెక్రటరీ రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పంపిన సందేశం వినిపించి గ్రామ సభ స్టార్ట్ స్పెషల్ ఆఫీసర్ ప్రారంభించారు. జూన్ 2 నుంచి ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించే జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందించడం, ఇంటర్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి వంటి పథకాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ ఆలోచనను, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని, అర్హులకు తప్పనిసరిగా లబ్ధి చేరేలా చూడాలని ఆదేశించారు. అనర్హులు లబ్ధి పొందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తాల గ్రామ స్పెషల్ ఆఫీసర్ , ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెంట్ నర్సింహా , గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్ గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం, ఉపసర్పంచ్ కట్ట స్వర్ణ, వార్డు మెంబర్లు దోటి శ్రీను,కట్ట సైదులు,బొమ్మరబోయిన కవిత, గురిజాల రమ్య,బండి శోభ ,అమలూరి అశోక్ , దోనాల శ్రీనివాస్ రెడ్డి, బొమ్మరబోయిన పావని , కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ , కట్ట రామకృష్ణ ,అంజిరెడ్డి,బ్రహ్మానంద రెడ్డి,బిక్షం రెడ్డి,వెంకటేశం,నారాయణ రెడ్డి,అంగన్వాడీ టీచర్స్ ,ఆశా వర్కర్లు,సంఘబంధం లీడర్లు, గురజాల స్వామి , సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,రైతులు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.