కాంగ్రెస్ అందించే ప్రతి సంక్షేమం ప్రతి కుటుంబానికి ఒక వరం

మున్సిపల్ చైర్ పర్సన్- సామినేని సుజాత

పయనిoచే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 మధిర ప్రతినిధి మధిర : ప్రజలకు ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని సంక్షేమ పథకాలు మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తుందని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆమోదం కోసం నిర్వహిస్తున్న వార్డు సభ గురువారం మధిర మున్సిపాలిటీ పరిధి ఇల్లందులపాడులో జరిగింది.ఈ కార్యక్రమానికి వార్డు సూపర్వైజర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత జరిగిన సభలో మాట్లాడారు.పదేళ్ల క్రితం నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు అందించిందని,రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు పాలించిన గత పాలకులు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.మళ్లీ నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కొత్త రేషన్‌ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు,సన్న బియ్యం,రైతు భరోసా,200 యూనిట్ల ఉచిత కరెంట్,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,తదితర సంక్షేమ పథకాలు అందిస్తోందని ఆమె అన్నారు.ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి సాధ్యం కానీ రీతిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనే మహాత్ర పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్లో అంకురార్పణం చేసింది అని తెలిపారు.ఈ పథకం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2న ప్రారంభమవుతుందని రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పథకం వర్తిస్తుందని అన్నారు.కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఇందిరమ్మ జీవిత బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.ఈ పథకం తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక వరంగా మారుతుందని,ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెంచిందని చైర్మన్ సుజాత అన్నారు.అనంతరం వార్డు సభలో ప్రభుత్వ పథకాల జాబితాను అధికారులు చదివి ప్రజలకు వినిపించారు.పేర్లు లేని వారు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *