పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 3,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామపంచాయతీలో ఈరోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది మొదటగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గేయం జయహో జై తెలంగాణ తో ప్రారంభమై తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించడం జరిగింది అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అనేక బహుళ సంక్షేమ పథకాలను జరుగుతున్న అభివృద్ధి గురించి గ్రామసభలో తెలియజేయడం జరిగింది గ్రామ సభలో ప్రజా సమస్యలపై ప్రత్యేక బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అర్హుల జాబితాను ఎటువంటి పక్షపాతం లేకుండా ఎంపిక చేయాలని ప్రగతి పథంలో గ్రామపంచాయతీ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను పంచాయితీలు అవసరాల నిమిత్తం వినియోగించుకోవాలని దుర్వినియోగానికి గ్రామపంచాయతీలు నిదర్శనంగా ఉండకూడదు అని ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవద్దని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ గా తల్లాడ ఏపీఎం రవికుమార్. సర్పంచ్ దీవెల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ రుద్రాక్ష వెంకటాచారి, గ్రామ కార్యదర్శి ఎస్కె మీరా, గ్రామ పెద్దలు దిరిశాల వెంకట నరసయ్య, దిరిశాల వెంకట్రామయ్య, మరియు వార్డు మెంబర్లు గ్రామ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకు సర్పంచ్ దీవెల వెంకటేశ్వర్రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.