గోధుమల పంపిణీ హైదరాబాద్ కే పరిమితం చేయడం సమంజసం కాదు : కాసాల వెంకట్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 03. తెలంగాణలో రేషన్ కార్డు కలిగివున్న పేద ప్రజలందరికీ గోధుమలు పంపిణీ చేయకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి కేవలం హైదరాబాద్ పరిధికి మాత్రమే గోధుమలు పంపిణీ చేసిందని నల్గొండ జిల్లా మాజీ ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు , బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు గోధుమల పంపిణీని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయడం సబబు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోందని రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజలు కూడా గోధుమలను ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నందున, వారికీ సబ్సిడీ గోధుమలు అందించాలనే డిమాండ్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గడిచిన రెండున్నర సంవత్సరాలుగా గత ప్రభుత్వ విధానాన్ని అవలంబిస్తూ హైదరాబాద్ ప్రజలకు మాత్రమే గోధుమలు పంపిణీ చేస్తుందని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. గురువారం చండూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతినెల, ప్రతి కార్డుపై అందించేటి సబ్సిడీ గోధుమలను రాష్ట్రమంతటా సప్లై చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు బియ్యం తో పాటుగా గోధుమలు, చక్కర, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, వంటనూనె, కందిపప్పు వంటి 9 రకాల వంట సరుకులు పట్నం, పల్లె అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇవ్వాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *