ఘనంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ డే.

పయనించే సూర్యడు న్యూస్, ఏప్రిల్ 3, 2026. కొమరం భీమ్, ఝాడే భక్త రాజ్, ప్రతినిధి. అసిఫాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ 108 ఆఫీసులో, జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో నేషనల్ మెడికల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ డే ను,108 స్టాఫ్ అందరు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ మాట్లాడుతూ 108 సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈఎంటిసికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు కాల్ రాగానే తొందరగా రెస్పాండ్ అయ్యి వారు వివిధ రకాలైనటువంటి ఎన్నో అత్యవసర కేసులను చేస్తూ, మండల ప్రజల అభినందనలు అందుకుంటూ,ఉత్తమ పురస్కారాలు కూడా అందుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా మరెన్నో ఉత్తమమైనటువంటి బెస్ట్ కేసులు చేస్తూ ఉత్తమ బెస్ట్ అవార్డ్స్ అందుకోవాలని అదేవిధంగా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా వారి వారి మండల ప్రజలకు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ వారి మండల ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఉత్తమమైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా లో పని చేస్తున్నటువంటి 108 మెడికల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్ లు,పైలెట్లు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *