పయనించే సూర్యుడు ఏప్రిల్ 03 తిరుపతి జిల్లా ప్రతినిధి ప్రశాంత్ చంద్రగిరి పట్టణంలోని కొత్తపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. మరణించిన మహేష్ వయస్సు సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా. మృతదేహంపై ప్రాథమికంగా ఎటువంటి గాయాలు కనిపించలేదని సమాచారం. మహేష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.