పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 మాచారెడ్డిమండలం హోబిల్ రెడ్డి సర్పంచ్ ఆధ్వరంలో గ్రామసభ మాచారెడ్డిమండలం చుక్కాపూర్ సర్పంచ్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామసభ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ గ్రామీణ పథకాల ప్రాముఖ్యత లబ్ధిదారుల పేర్లు గ్రామసభలో తెలుపుట గురించి గ్రామసభ పాలకవర్గం సబ్యులు అయిన ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు మహిళ సంఘాలు,యువజన సంఘాలు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,ఉపాధి హామీ కూలీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, సామాజిక పెన్షన్ దారులు, రైతు భరోసా మరియు రైతు బీమా లబ్ధిదారులు, వివిధ పథకాల లబ్ధిదారులు గ్రామ స్థాయి అధికారులు అంగన్వాడి టీచర్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు,గ్రామ పరిపాలన అధికారి,ఆరోగ్య శాఖ అధికారులు,మహిళ మరియు వివో ఏ పాఠశాల కమిటీ ఛైర్మన్ వ్యవసాయ విస్తరణ అధికారి,అటవీ శాఖ అధికారి ఈ జి ఎస్ అధికారులు,గ్రామ నీటి సరఫరా శాఖ, గ్రామ విద్యుత్ శాఖ అధికారి,గ్రామ రేషన్ డీలర్,ఉద్యానవన అధికారులు,మిషన్ భగీరథ లైన్ మెన్, అందరూ ఇట్టి గ్రామసభకి లబ్ధిదారుల వివరాలతో కూడి మరియు శాఖ యొక్క పూర్తి సమాచారంతో హాజరు అయ్యి గ్రామంలో సమస్యలు తొందర్లో తెస్తామని గ్రామసభలో తెలపడం అయింది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు చుక్కాపూర్ గ్రామ సభలో పాల్గొన్న గ్రామసభలతో ప్రజాపాలన ప్రజలకు చేరువవుతోంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా గ్రామసభల నిర్వహణ విద్య, వైద్యం, సంక్షేమంతో గ్రామాభివృద్ధి సాధ్యం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా చుక్కాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామ, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామసభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవగాహన కల్పించే వేదికగా ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు . ముఖ్యంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డు స్థాయిలో విస్తృతంగా వివరిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం క్షేత్రస్థాయిలో పథకాల అమలులో పారదర్శకత కోసం గ్రామస్థాయిలో పెండింగ్ దరఖాస్తులు, అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి విద్య ముఖ్యమని , పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సేవల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. చుక్కాపూర్ గ్రామంలో అమలు చేసిన పథకాల వివరాలను వెల్లడిస్తూ,రైతు భరోసా కింద మందికి కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు కింద మందికి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు గ్యాస్ సబ్సిడీ కింద మందికి లక్షలు, చేయూత పింఛన్ల ద్వారా మందికి రూ లక్షలు అందించినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా మంది లబ్ధి పొందినట్లు చెప్పారు. కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద మందికి లక్షలు, కొత్తరేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా లక్షలు, వడ్డీ లేని రుణాలుగా లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించి, వాటి అమలుపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. గ్రామసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. ఈ వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ , ఉప సర్పంచ్ , మండల ప్రత్యేక అధికారి , ఎంఈఓ , అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.