
పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 3,తల్లాడ రిపోర్టర్ బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను గురువారం తల్లాడలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి), గౌడ సంఘం జిల్లా నాయకులు రావుల గోపి గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ తెలంగాణ ప్రాంతం కోసం ఆనాడు రజాకార్లను ఎదిరించి అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా ఉద్యమాలు చేశారని అన్నారు. ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని యువత బహుజనుల రాజ్యాధికారం కోసం ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. తొలుత ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ్ సంఘం తల్లాడ మండల అధ్యక్షులు గుండ్ల నాగయ్య, ఉపాధ్యక్షులు గుండ్ల వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా అధ్యక్షులు సమ్మెట రామకృష్ణ, మాజీ సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, సున్నం హరీష్, మొక్కా నవీన్, మొక్కా తిరుపతిరావు, సత్యనారాయణ బొడ్డు రామ్ లక్ష్మణ్, బొడ్డు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.