పయనించే సూర్యడు ఏప్రిల్ 03 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు సర్దార్ సర్వాయి పాపన్న 316వ వర్ధంతి సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాపన్నని యాది చేసుకోవడమే కాదు వారి అడుగుజాడల్లో నడవడమే వారికిచ్చే నిజమైన నివాళి. పాపన్న జీవిత విశేషాలు, వారి గొప్పతనం చెప్పుకుంటూ పోతే సరిపోదు. కష్టజీవుల రాజ్యం కోసం పోరాడాలి. మన రాజ్యాంగంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సమానత్వం సాధించాలని చెప్పుకున్నప్పటికీ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. పేదరికం మరింత పెరుగుతుంది. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు. కుల పీడన, అసమానతలు పట్టిపీడిస్తున్నాయి. అగ్రకుల దూరహంకారాలు రోజు రోజుకు పెచ్చు మీరుతున్నాయి. తక్కువ కులం అని చిన్న చూపు చూడడం, గుడిలోకి రానీయకపోవడం నేటికీ కొనసాగు తున్నాయి. ఇక రాజకీయ రంగంలో కోటీశ్వరులదే పైచేయి. మామూలు వాళ్లు ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి స్థితిలో అంబేద్కర్ రాజ్యాంగం లో మనకు కల్పించిన హక్కుల కోసం పోరాడాలి. కూలీలు, రైతులు, శ్రామికుల తరపున నిలబడాలి కలబడాలి. శ్రామిక రాజ్యం స్థాపన కోసం, సామ్యవాద సాధన లక్ష్యంగా అడుగులు వేయాలి. అదే సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని అన్నారు.ముందుగా సంఘం జెండాను ఎరగాని లింగయ్య ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ రామిని విజయ వర్ధన్ రెడ్డి, గ్రామ పెద్దలు మిర్యాల గురవయ్య,కాసాని శ్రీనివాసరావు, గ్రామ వార్డు మెంబర్ మిర్యాల శ్రీను,స్థానిక డాక్టర్ ఆర్.ఎం.పి వీఎల్ఎన్ గౌడ్, సోమ వీరయ్య, మండవ నాగమణి, పోలంపల్లి రాజు, పోలంపల్లి చిన్న వీరయ్య, బెల్లంకొండ లింగయ్య, బెల్లంకొండ వెంకయ్య, మిర్యాల శీను ,మిర్యాల గురుస్వామి ,కన్నెబోయిన ఉప్పలయ్య ,రాజుల కృష్ణమూర్తి, పగడాల బుచ్చిరెడ్డి ,కాంపాటి ఉపేందర్, గుజ్జ కోటయ్య, రెడ్డి మల్ల వీరబాబు తదితరులు పాల్గొన్నారు