దళిత క్రైస్తవుల హక్కుల కోసం, ఆకివీడు బాధితులకు న్యాయం జరిగే వరకు బిఎస్‌పి పోరాటం ఆగదు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 03.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ O ప్రతినిధి జె. నాగరాజ) మదనపల్లి: బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బిందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు,ఈరోజు అన్నమయ్య జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. ​ఈ సందర్భంగా వారు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు: దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు సూచనల మేరకు, మతం మారినప్పటికీ దళితులు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను పరిగణనలోకి తీసుకొని దళిత క్రైస్తవులకు వెంటనే ఎస్సీ హోదా కల్పించాలి. గతంలో సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఏ విధంగా రిజర్వేషన్లు వర్తిస్తున్నాయో, అదే రీతిలో దళిత క్రైస్తవులకు కూడా న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మా పార్టీ ​ఈ కార్యక్రమంలో, యుగంధర్ అబ్బవరం, గూడుపల్లి శివ, మల్లికార్జున, సోమశేఖర్, సంధ్యారాణి, కన్నయ్య, గూడుపల్లి అరుణ్, శ్రీనాథ్, దంపట్ల శివకుమార్, చంద్ర, అబ్బవరం నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు..