పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -03 రామగుండం-3 ఏరియా నర్సరీ నూతన టెండర్ సవరణ చేసి పిలిచి కార్మికులను ఆదుకోవాలని ఆర్జి-3 జిఎం మధుసూదన్ కి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…14 ఫిబ్రవరి 2025లో నర్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు సీఎం పిఎఫ్ ఉచిత వైద్యం బోనస్ తదితర చట్టబద్ధకులు అమలు చేయాలని సింగరేణి యాజమాన్యం సర్కులర్ జారీ చేయడం జరిగినది కానీ ఇప్పుడు పిలిచిన టెండర్ లో స్పష్టత లేక మూలంగా కాంట్రాక్టర్లు ఎవరు కూడా టెండర్లు వేయకుండా ముందుకు రాకపోవడంతో కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు కాబట్టి సింగరేణిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కటే కానీ పార్క్ అండ్ గార్డెన్స్ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు అమలు చేస్తున్న యాజమాన్యం నర్సరీకి వచ్చారికే అడ్డమీది కూలీలుగా చూడడాన్ని సరికాదని ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఈ టెండర్‌ను మాడిఫై చేసి నర్సరీ కార్మికులకు జీవో ప్రకారంగా వేతనాలు బోనస్ సీఎం పిఎఫ్ వైద్యము చట్టబద్ధ హక్కులు అమలు చేసి టెండర్ పిలవాలని జిఎం ను కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పి లక్ష్మి, జయ,పద్మ, పి సరిత తదితరులు పాల్గొన్నారు.