నిరుపేద మహిళ వివాహానికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి చేయూత

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 3 పట్టణంలోని రేగుంట ఏరియాలో నివాసం ఉంటున్న బక్కురి విష్ణుప్రియ గారికి వివాహం నిర్చయం అవగా తండ్రిని కోల్పోయి పేదరికంతో బాధపడుతున్న విష్ణుప్రియ గురించి ఆ ఏరియా ప్రజలు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురాగా 120 మందికి బోజనాలను సరిపడా బియ్యం, కూరగాయలు, నూనె, మరియు ఇతర వస్తువులతో పాటు పెళ్లి కూతురుకు పట్టు చీరని అందించారు. ఈ కార్యక్రమం లో మెట్ పల్లి 13వ వార్డు కౌన్సిలర్ అజయ్ గుడికందుల అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్. జగ్గాసాగర్ సర్పంచ్ పుల్ల జగన్ గౌడ్. పురాణం రాజేందర్. తారి రాజశేఖర్.కోలా గంగరెడ్డి, పుదరి నాగరాజ్, బాల్క రాకేశ్, అశోక్ గుడికందుల, పుదారి చిన్న నర్సయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు