నీటిని విడుదల చేసి పంటలు కాపాడండి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 3 మెట్ పల్లి మండలం కోనరావుపేట గ్రామానికి సాగు నీటిని అందించి పంటలను కాపాడాలని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ ఎఫ్ సి కెనాల్ ద్వారా పెద్ద వాగులోకి విడుదల చేసి మాన్పూర్ కెనాల్ నుంచి సాగు నీటిని గ్రామానికి విడుదల చేయాలని కోరుతూ ఈ యన్ సి హైదరాబాద్ కి రైతులు వినతి పత్రం అందించి సమస్యను విన్నవించారు. మెట్ పల్లి ఎస్ అర్ ఎస్ పి ఈ సురేష్ కు సమస్యను విన్నవించి బాధను చెప్పుకున్న పట్టించుకోకుండా నీటిని విడుదల చేయడం లేదంటూ దీంతో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మండలం లోని కొండ్రికర్ల గ్రామానికి చెందిన ఒక రైతు కు ఎలాంటి అనుమతి లేకుండా నీటిని అందిస్తూ వారికీ సహకరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అధికారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని గ్రామాల రైతులకు కావలసింది సాగునీరేనని దీనిని దృష్టిలో ఉంచుకొని కోనరావుపేట కొండ్రికర్ల గ్రామాలకు సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో మారు గంగారెడ్డి, అనిరెడ్డి ఆనంద రెడ్డి,మారు సాయిరెడ్డి, నల్ల రాజేష్, పెంట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.