పల్లె పల్లెలో గ్రామసభలు.

* గ్రామ సభలో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 3 సాలూర : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రంగా ఆదేశాల మేరకు సాలూర మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామసభలు గురువారం నిర్వహించారు గ్రామసభలు తెలంగాణ గీతాన్ని ఆలపించి గ్రామ సభలను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రత్యేక అధికారులు మండల ప్రత్యేక అధికారి పద్మజ మండల ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామసభలలో వెల్లడించారు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులకు అందుతుందన్నారు. ముందు ముందు కూడా ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చేరవేసే బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉంటుందన్నారు. పాత సాలంపాడ్ గ్రామంలో 21 సంవత్సరాల కింద ప్రభుత్వం ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చినప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు పట్టాలు ఇప్పించే విధంగా అధికారులు ప్రభుత్వం దృష్టికి చేర్చి న్యాయం చేయాలన్నారు గ్రామంలోని సమస్యలను గ్రామస్తులు అధికారులు మరియు పంచాయతీ పాలకవర్గానికి తెలియపరచగా అధికారులు మినట్స్ బుక్కులో నమోదు చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి జిల్లా అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వానికి సమస్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు నమ్మబలికించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ వాహనాలను నడపడంతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను వెంబడి ఉంచుకొని ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉంచాలని అదేవిధంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టినప్పటికీ సాయంత్రం సమయంలో కుప్పలుగా చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు రోడ్లపై వేసిన ధాన్యం రాశుల వలన ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరిగినా సంబంధిత రైతు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బోధన్ రూరల్ ఠాణా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి హెచ్చరించారు.ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనిస్తూ చాకచక్యంగా వ్యవహరించి వాహనాలు నడపాలని ఇతవు పలికారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ లు,పంచాయతీ పాలకవర్గాలు, కార్యదర్శులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *