పుంగనూరు నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి తనిఖీలు

పయనించే సూర్యుడుl మేజర్ న్యూస్ ఏప్రిల్ 03.04.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు లో మధ్యాహ్న భోజనంలో బల్లి పడినసంఘటన పై విచారణ చేసిన ఫుడ్ ఇన్ స్పెక్టర్ గురులక్ష్మి. ఆమె మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీ సాంపిల్స్ ను పరిశీలించి ల్యాబ్ కు పంపించామన్నారు.నిన్న జరిగిన ఈ సంఘటన పై విద్యార్థుల తల్లితండ్రులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించడం జరిగింది.అలాగే వంటగది,ముడి సరుకులు,వంట సామాన్ల శుభ్రత, వంట నూనెలను కూడా పరిశీలించామన్నారు. సంఘటన కు సంబందించిన మెడికల్ రిపోర్ట్ లను పూర్తిగా పరిశీలించి నివేదికను పై స్థాయి అధికారులకు పంపనునున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గురులక్ష్మి వెల్లడించారు.