‘పెద్దకడబూరు’ అమరావతి చట్టబద్ధతపై హర్షం

మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ హర్షం వ్యక్తం చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 03 రిపోర్టర్ అభిఅమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన నేపథ్యంలో గురువారం మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతిని వెలిగించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత లభించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల గెలుపు అని ఆయన పేర్కొన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల ఆశయాలకు న్యాయం జరిగిందని తెలిపారు. అమరావతిని అణగదొక్కాలని ప్రయత్నించిన శక్తులకు ఇది గట్టి సమాధానం అని వ్యాఖ్యానించారు.