పేట మధ్యలో వెలుగుల హోరు

★ సెంటర్ లైటింగ్ పనులు వేగంగా పూర్తి దిశగా ★ లక్షల వ్యయంతో ఆధునిక దీపాల ఏర్పాటు. త్వరలో ప్రజలకు మెరుగైన సౌకర్యం,

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో సెంటర్ లైటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ చైర్ పర్సన్ జూపల్లి శశికళమ్మ సారథ్యంలో, వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ బి నాగరాజు ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. యువ నాయకులు జూపల్లి ప్రమోద్, ఫణి నాయకత్వంలో లక్షల రూపాయలతో ఆధునిక దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. పనుల పురోగతిని వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేష్ బాబు స్వయంగా పరిశీలించారు. పట్టణ ప్రజలకు మెరుగైన కాంతి సౌకర్యం అందించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణ అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, త్వరలోనే సెంటర్ లైటింగ్ అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణ, బాబి, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.