పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 దండేపల్లి రిపోర్టర్ మందల మల్లేష్ దండేపల్లి మండలంలోని కన్నేపల్లి నంబాల గ్రామ పంచాయతీ లో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ ఈ ప్రజాపాలన ప్రభుత్వం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గెలిచి రెండున్నర సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని చెప్పారు.. ఇవే కాకుండా మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేద ప్రజలకు ఎల్ వో సి చెక్కులు, సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సురేఖమ్మ గారిని శాలువాతో సన్మానించారు.. ఈ కార్యక్రమంలో మండల వివిధ శాఖల అధికారులు, గ్రామ స్పరంచ్,ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..