ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 6వ వార్డులో వార్డు సభ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 03 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం రాయికల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో వార్డు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ వేముల మౌనిక రాము అధ్యక్షత వహించారు. పట్టణంలోని పీవీఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వార్డు ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి ఫయాజ్, విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్, అంగన్వాడి కార్యకర్త పద్మ, మెప్మా ఆర్పీ రూప శ్రీ,ఆశ వర్కర్ భారతి, అలాగే వార్డు ప్రజలు దరి రాము, శేఖర్, లక్ష్మణ్, రఫీ, రాజీ భాయి, అబిద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *