పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 03 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం రాయికల్ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో వార్డు సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ వేముల మౌనిక రాము అధ్యక్షత వహించారు. పట్టణంలోని పీవీఎస్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వార్డు ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధికారి ఫయాజ్, విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్, అంగన్వాడి కార్యకర్త పద్మ, మెప్మా ఆర్పీ రూప శ్రీ,ఆశ వర్కర్ భారతి, అలాగే వార్డు ప్రజలు దరి రాము, శేఖర్, లక్ష్మణ్, రఫీ, రాజీ భాయి, అబిద్ తదితరులు పాల్గొన్నారు.