పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినాపల్లి మండలం ఉడుగుల కుంట తండా గ్రామపంచాయతీలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బుజ్జి చందూలాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు విపులంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్న బియ్యం వంటి పథకాలపై లబ్ధిదారులతో చర్చించారు. పథకాల అమలు విధానం, అర్హతలు మరియు ప్రయోజనాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఈ గ్రామసభలో ఉప సర్పంచ్ శ్రీను నాయక్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి నాగమణి, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు