
పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన పేదలకు పారదర్శకంగా చేరేలా చేయడమే ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాష్ట్రవ్యాప్తంగా 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని అన్నారు లబ్ధిదారులకు ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో ప్రయోజనాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు గత రెండేళ్లలో ప్రభుత్వం అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని పేర్కొన్నారు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తున్నదని తెలిపారు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు కొత్త పథకాలు అమల్లోకి రానున్నాయని వెల్లడించారు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐటిడిఎ పీవో యువరాజ్ మార్మాట్ ఉట్నూర్ ఇంచార్జి సబ్ కలెక్టర్ సలోని ఛబ్రా ట్రైనీ కలెక్టర్ ఇతర అధికారులు గ్రామ సర్పంచ్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.