ప్రభుత్వ పథకాలును సద్వినియోగం చేసుకోండి: సర్పంచ్ నారగాని రాంబాయి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 03, (చింతకాని మండలం రిపోర్టర్ .వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా గ్రామ రైతు వేదికలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి, మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలును ప్రతి అర్హుడైన లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు మూడు నెలలు పూర్తైన సందర్భంలో ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, గత పాలకుల లోపాలను సరిచేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. “మేము పాలకులు కాదు, ప్రజల సేవకులం” అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత పథకాలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ బుద్దే చిరంజీవి, ఉప సర్పంచ్ అంబటి శరత్, మాజీ సర్పంచ్ కంభం వీరభద్రం, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే ఐకెపి సభ్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, హాస్టల్ వార్డెన్, రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *