బిజినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిద్దె రాములు నియామకం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 3 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిద్దె రాములు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మిద్దె రాములు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కి, అలాగే ఎంపీ మల్లు రవి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీకి విధేయుడిగా పనిచేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.