పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని బొరుసుగడ్డ తండా గ్రామపంచాయతీలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.ఆర్. ఆఫీసర్ కార్తిక్ రెడ్డి హాజరై ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ అభివృద్ధిపై వివరించారు. గ్రామ సర్పంచ్ లలిత రవి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పంచాయతీ కార్యదర్శి శిరీష, ఉప సర్పంచ్ చావలి, వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చలు జరిపి ప్రజల సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.